Jagan Mohan Reddy: లిక్కర్ స్కామ్ లో జగన్ త్వరలోనే అరెస్ట్ అవుతారు: జ్యోతుల నెహ్రూ

Jagan Mohan Reddy to be arrested soon in Liquor Scam says Jyothula Nehru
  • లిక్కర్ స్కామ్ కేసులో వేగం పెంచిన సిట్
  • మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
  • మిథున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న జ్యోతుల నెహ్రూ
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. వరుసగా కేసులు నమోదు చేస్తూ, నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ త్వరలోనే అరెస్ట్ అవుతారని చెప్పారు. మిథున్ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. రూ. 3,500ల కోట్ల మద్యం స్కామ్ లో వాటాలు తేలకపోవడంతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బయట పడ్డారని చెప్పారు. ఈ కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. మద్యం పాలసీని కేబినెట్ మీటింగ్ లో ఆమోదించిన ప్రతి ఒక్కరినీ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు.
Jagan Mohan Reddy
AP Liquor Scam
YSRCP
Mithun Reddy Arrest
Jyothula Nehru
Vijay Sai Reddy
Kasireddy Rajasekhar Reddy
Andhra Pradesh Politics

More Telugu News