Nihar Kapoor: భల్లాలదేవుడి పాత్ర అలా మిస్సయిపోయింది: జయసుధ తనయుడు నిహార్

Nihar Kapoor Missed Bhallaladeva Role in Baahubali
  • ఆసక్తికర అంశాలు వెల్లడించిన నిహార్ కపూర్
  • భల్లాలదేవుడి పాత్రకు తొలుత రానానే అనుకున్న బాహుబలి బృందం
  • డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో నిహార్ ను సంప్రదించిన రాజమౌళి
  • తానే చేస్తానంటూ మళ్లీ వచ్చిన రానా
టాలీవుడ్ చరిత్రలో బాహుబలి పార్ట్-1, పార్ట్-1 చిత్రాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి. ఇందులో హీరో పాత్ర అమరేంద్ర బాహుబలికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, విలన్ పాత్ర భల్లాలదేవుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భల్లాలదేవుడిగా రానా దగ్గుబాటి జీవించారు. అయితే, ఈ పాత్ర వెనుక ఓ ఆసక్తికర అంశాన్ని నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ వెల్లడించారు. 

తొలుత భల్లాలదేవుడి పాత్రకు రానానే ఎంపిక చేసుకున్నారని, అయితే ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో బాహుబలి బృందం తనను సంప్రందించిందని తెలిపారు. ఆ పాత్ర కోసం తాను 4 వారాల పాటు శిక్షణకు కూడా హాజరయ్యానని, ఆ తర్వాత రానా మళ్లీ వచ్చి తాను ఆ పాత్ర చేస్తానని చెప్పడంతో ఆయననే ఫైనలైజ్ చేశారని నిహార్ వివరించారు. 

దాంతో, దర్శకుడు రాజమౌళి తనకు కాలకేయుడి పాత్రను ఆఫర్ చేశారని, ఆ పాత్రకు సంబంధించిన డిజైన్లను కూడా చూపించారని వెల్లడించారు. కానీ ఆ పాత్రకు అధికంగా మేకప్ ఉండడంతో, తన ముఖం కనిపించదని అమ్మ (జయసుధ) భావించిందని, తొలి చిత్రంలోనే ముఖం సరిగా కనిపించకుండా ఉంటే ఎలా... ప్రేక్షకుల నుంచి సరైన స్పందన ఉండకపోవచ్చని తెలిపిందని నిహార్ వివరించారు. బాహుబలి వంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో పాత్ర మిస్సవడం అంటే మామూలు విషయం కాదని, అయితే అందుకు తానేమీ బాధపడడంలేదని అన్నారు. 
Nihar Kapoor
Baahubali
Rana Daggubati
SS Rajamouli
Bhallaladeva
Kalakeya
Jayasudha
Telugu cinema
Tollywood
Movie casting

More Telugu News