ఘనంగా లాల్‌దర్వాజా మహాకాళి బోనాలు ప్రారంభం
అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేకంగా ఒక క్యూలైన్ ఉంది. అలాగే భక్తుల కోసం రెండు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.