Vietnam Boat Accident: వియత్నాం తీరంలో విషాదం... పడవ బోల్తా పడి 34 మంది మృతి

Vietnam Boat Accident 34 Dead in Ha Long Bay
  • వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హా లాంగ్ బేకు పడవ వెళ్తుండగా ప్రమాదం
  • బలమైన గాలులతో తల్లకిందులైన పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ
  • మరో 8 మంది గల్లంతు
  • 11 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు 
వియత్నాం తీరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ పడవ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మునిగిపోవడంతో 34 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు 11 మందిని రక్షించాయి. పర్యాటకుల్లో దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే, వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హా లాంగ్ బేకు 48 మంది పర్యాటకులు, ఐదుగురు సిబ్బందితో ఓ పడవ బయలుదేరింది. అయితే, ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీయడంతో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి పలువురిని రక్షించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా తెలిపింది. 
Vietnam Boat Accident
Ha Long Bay
Vietnam Tourism
Boat Capsizes
Tourist Boat Accident
Vietnam Coast
Halong Bay Boat
Ship Accident

More Telugu News