ఐఐటీ ఖరగ్ పూర్ లో మరో విద్యార్థి ఆత్మహత్య... ఈ ఏడాది నాలుగో ఘటన!
- బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న రిథమ్ మోండల్ ఆత్మహత్య
- ఈ ఏడాది జనవరి నుంచి ఇది నాలుగో ఆత్మహత్య
- మృతి చెందిన విద్యార్థిది కోల్ కతా
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ ఐఐటీలో ఇది నాలుగో ఆత్మహత్య కావడం గమనార్హం. జనవరి 12న ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న షాన్ మాలిక్, ఏప్రిల్ 4న ఓషన్ ఇంజినీరింగ్ చదువుతున్న అనికేత్ వాకర్, మే 4న మహమ్మద్ ఖమన్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.