Naga Vamsi: 'గుంటూరు కారం'పై ట్రోలింగ్... ఆశ్చర్యం వ్యక్తం చేసిన నిర్మాత నాగవంశీ

Naga Vamsi Expresses Surprise Over Guntur Kaaram Trolling
  • 2024 జనవరిలో వచ్చిన గుంటూరు కారం
  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టయినర్ చిత్రం
  • తొలి రెండ్రోజులు విపరీతంగా ట్రోల్ చేశారన్న నాగవంశీ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుంటూరు కారం’ చిత్రం 2024 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలై మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ సినిమా గురించి టాలీవుడ్ యువ నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ సినిమాపై వచ్చిన నెగెటివ్ ట్రోల్స్ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా  తొలి రెండ్రోజులు ఈ సినిమా విపరీతంగా ట్రోలింగ్ కు గురైందని, అలా ఎందుకు జరిగిందన్నది తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. అందులో ట్రోల్ చేయాల్సినంత విషయం ఏముంది... ఆ సినిమా ఓటీటీలో రిలీజై కూడా ఆడియన్స్ ను అలరించిందని వివరించారు.

‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబుతో పాటు శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈ చిత్రం తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ డబ్బింగ్‌ అయి విడుదలైంది.
Naga Vamsi
Guntur Kaaram
Mahesh Babu
Trivikram Srinivas
Sreeleela
Meenakshi Chaudhary
Harika and Hassine Creations
Tollywood
Telugu cinema
OTT release

More Telugu News