Shah Rukh Khan: కింగ్ సినిమా షూటింగ్ లో షారుక్ ఖాన్ కు గాయాలు!

Shah Rukh Khan Injured on King Movie Set
––
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ‘కింగ్’ సినిమా షూటింగ్ లో గాయపడినట్లు సమాచారం. ఓ యాక్షన్‌ సన్నివేశంలో డూప్‌ లేకుండా స్టంట్‌ చేస్తుండగా షారుక్ గాయపడ్డారని, దీంతో షూటింగ్ నిలిచిపోయిందని తెలుస్తోంది. 

చికిత్స కోసం షారుక్ తన బృందంతో కలిసి అమెరికా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఏం జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. షారుక్ గాయానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అది తీవ్రమైన గాయం కాదని, కండరాల గాయం అని షారుక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. హీరో గాయపడడంతో ‘కింగ్‌’ షూటింగ్‌ ను సెప్టెంబర్‌ కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

షారుక్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందిస్తున్న యాక్షన్‌ కథా చిత్రమే కింగ్.. ఇందులో సుహానాకు తల్లి పాత్రలో రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా షారుక్ ఖాన్ గాయపడ్డారని సమాచారం.
Shah Rukh Khan
King Movie
Shah Rukh Khan Injury
Suhana Khan
Siddharth Anand
Bollywood
Action Movie
Rani Mukerji

More Telugu News