Kireeti Reddy: తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు: కిరీటి రెడ్డి

Kireeti Reddy Thanks Telugu Audience for Junior Movie Success
  • జూనియ‌ర్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు కిరీటి 
  • నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా
  • తెలుగులో మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కిరీటి కృత‌జ్ఞ‌త‌లు 
  • ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా స్పెష‌ల్ పోస్ట్ పెట్టిన హీరో
పారిశ్రామికవేత్త గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ప‌రిచ‌య‌మైన‌ చిత్రం జూనియ‌ర్. నిన్న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీలీల, జెనిలియా డిసౌజా, రవిచంద్రన్, రావు రమేశ్‌, ఆచ్యుత్ రావు త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి రాధాకృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాయి శివానీ స‌మ‌ర్ప‌ణ‌లో వరాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యాన‌ర్‌ల‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు. 

తెలుగుతో పాటు క‌న్న‌డ భాష‌లో ఈ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే, ఈ సినిమాకు తెలుగులో మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కిరీటి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సందర్భంగా  'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. 

"తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. ‘జూనియర్’కు వస్తున్న ప్రేమ, ఆదరణను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎంతో నిజాయితీగా, హృదయపూర్వకంగా ఈ సినిమాను తీశాం. మీకు మంచి సినిమాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం. మీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను" అంటూ కిరీటి త‌న పోస్టులో రాసుకొచ్చారు.
Kireeti Reddy
Junior Movie
Gali Janardhan Reddy
Telugu Cinema
Sreeleela
Radhakrishna Reddy
Sai Korrapati
Telugu Film Industry
Kannada Movie

More Telugu News