Vidudala Rajini: ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే తప్పు ఒప్పుకోవాలి: విడదల రజని

Vidudala Rajini Demands Apology from TDP MLA for Remarks on Roja
  • నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాశ్ పై వైసీపీ నేతల ఫైర్
  • భానుప్రకాశ్ దిగజారుడు మాటలు మాట్లాడారన్న రజని
  • భానుప్రకాశ్ వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
మాజీ మంత్రి రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రి విడదల రజని కూడా దీనిపై స్పందించారు. 

"మాజీ మంత్రి రోజా గారిపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అతను మాట్లాడిన దిగజారుడు మాటలు సమాజం లోని మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. టీడీపీ నాయకులు మహిళలను ఎలా అగౌరవంగా చూస్తారో చెప్పడానికి ఆ మాటలే నిదర్శనం. కనీసం ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే తప్పుని ఒప్పుకుని రోజా గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా" అంటూ రజని ట్వీట్ చేశారు. 

రూ.2 వేల కోసం రోజా ఏ పనైనా చేస్తుంది అంటూ భానుప్రకాశ్ వ్యాఖ్యానించినట్టు అతడిపై ఆరోపణలు రావడం తెలిసిందే.
Vidudala Rajini
Roja
Gali Bhanu Prakash
Nagari
TDP
YSRCP
Andhra Pradesh Politics
Political Controversy
Women's Respect
Apology Demand

More Telugu News