Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు గాయం.. పాట్నాలో ఆసుపత్రిలో చికిత్స

Prashant Kishor Injured During Roadshow Admitted to Patna Hospital
  • బద్లావ్ సభకు రోడ్ షోగా వెళుతున్న సమయంలో గాయం
  • ప్రజలను కలిసేందుకు కారు నుంచి బయటకు వంగిన సమయంలో గాయం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ కిశోర్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌కు గాయమైంది. ఆరా జిల్లాలో బద్లావ్ సభకు వెళుతూ భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో ప్రమాదవశాత్తు ఆయన పక్కటెముకల భాగానికి గాయమైంది. రోడ్ షో సమయంలో ప్రజలను కలిసేందుకు ఆయన కారు నుంచి బయటకు వంగిన సమయంలో ఈ గాయమైనట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ప్రశాంత్ కిశోర్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, మెరుగైన చికిత్స కోసం పాట్నాకు తరలించారు. పక్కటెముకలకు గాయం కావడంతో ప్రశాంత్ కిశోర్ నొప్పితో బాధపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Prashant Kishor
Prashant Kishor injury
Jan Suraaj Party
Election strategist
Patna hospital

More Telugu News