Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దెబ్బ... రెండు నెలలుగా ఎయిర్‌పోర్టు మూసివేత

Operation Sindoor impact Rahim Yar Khan Airport closed for two months
  • రెండు నెలలు గడుస్తున్నా తెరుచుకోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్
  • వరుసగా మూడోసారి నోటమ్ జారీ చేసిన పాకిస్థాన్ 
  • ఆగస్ట్ 5 వరకు రన్ వే మూసి ఉంటుందని వెల్లడి
పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్ జరిగి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద ఉన్న రన్‌వే ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఈ ఎయిర్‌పోర్టు మూసివేతను మూడోసారి పొడిగించింది. ఆగస్ట్ 5 వరకు రన్‌వే మూసివేసి ఉంటుందని పాకిస్థాన్ తాజాగా నోటమ్ విడుదల చేసింది. విమానయాన కార్యకలాపాలు అందుబాటులో ఉండవని పేర్కొంది.

అయితే మూసివేతకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మే 10న భారత్ దాడి చేసిన నేపథ్యంలో తొలి నోటమ్ జారీ అయింది. దాంతో పంజాబ్ ప్రావిన్సులో ఉన్న ఈ వ్యూహాత్మక ఎయిర్‌బేస్ ఒక వారం పాటు అందుబాటులో ఉండదని ప్రకటించింది. ఆ తర్వాత గత నెల నాలుగో తేదీన రెండో నోటమ్ జారీ చేసింది. మూసివేతను జులై 4 వరకు పొడిగించింది. తాజాగా ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించింది.
Operation Sindoor
Rahim Yar Khan Airbase
Pakistan
Indian Army
Punjab Province
NOTAM

More Telugu News