Chandrababu Naidu: వర్షంలో తన గొడుగు తానే పట్టుకుని వెళ్లిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Carries His Own Umbrella in Rain
  • ఉండవల్లిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • గొడుగు వేసుకుని సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు
  • ఫొటోలను పంచుకున్న టీడీపీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారపరమైన ఆడంబరాలకు దూరంగా ఉంటారు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన తరగని ఉత్సాహంతో ఉంటారు. ఇవాళ ఉండవల్లిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అయితే, ఆ సమయంలో వర్షం పడుతుండడంతో చంద్రబాబు స్వయంగా గొడుగు పట్టుకుని వెళ్లారు. పక్కనే భద్రతా సిబ్బంది, ఇతర స్టాఫ్ ఉన్నప్పటికీ, ఆయనే వర్షంలో గొడుగు వేసుకుని చలాకీగా నడుచుకుంటూ వెళ్లారు.

దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఎండైనా... వానైనా... దార్శనికుడి ముందడుగు... తానే పట్టాడు గొడుగు... అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Chandrababu Naidu
Chandrababu
Andhra Pradesh
TDP
Telugu Desam Party
Undavalli
Parliamentary Party Meeting
Rain
AP CM

More Telugu News