Bombay High Court: భర్తతో శృంగారానికి నిరాకరించినా విడాకులు ఇవ్వొచ్చు: బాంబే హైకోర్టు

Bombay High Court Says Denying Sex Grounds for Divorce
  • 2015లో విడాకుల కోసం పుణేలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన వ్యక్తి
  • విడాకులకు అనుమతించిన ఫ్యామిలీ కోర్టు
  • బాంబే హైకోర్టును ఆశ్రయించిన భార్య
  • వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించడం క్రూరత్వంతో సమానమన్న హైకోర్టు
విడాకుల అంశంపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించడం క్రూరత్వంగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. భార్య నుంచి విడాకులు కోరడానికి ఈ కారణాలును చూపించవచ్చని తెలిపింది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

2013లో వివాహం చేసుకున్న ఒక జంట ఆ తర్వాత సంవత్సరం నుంచి విడివిడిగా జీవిస్తోంది. శృంగారానికి నిరాకరించడంతో పాటు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తనను వేధిస్తోందని, అందరి ముందు అవమానిస్తూ మానసిక వేదనకు గురి చేస్తోందని భర్త ఆరోపించారు. భార్య పుట్టింటికి వెళ్ళినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన 2015లో పుణేలోని ఫ్యామిలీ కోర్టును విడాకుల కోసం ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం విడాకులకు అనుమతించింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుపై భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనను అత్తమామలు మాత్రమే వేధించారని, భర్తపై తనకు ప్రేమ ఉందని భార్య తన పిటిషన్‌లో పేర్కొంది. విడిపోవాలని తాను కోరుకోవడం లేదని వెల్లడించింది. అదే పిటిషన్‌లో తనకు నెలకు రూ. 1 లక్ష భరణం చెల్లించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ రేవతి మోహితే డెరే, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనం విచారించింది.
Bombay High Court
Divorce
Cruelty
Marital Rape
Extra marital affair
Family Court
Pune
Maintenance
Mental harassment

More Telugu News