Chandrababu Naidu: చంద్రబాబు చేస్తున్న ద్రోహం గురించి ప్రజలు ఆలోచించాలి: గడికోట శ్రీకాంత్ రెడ్డి

Chandrababu Betraying People Says Gadikota Srikanth Reddy
  • ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్న శ్రీకాంత్ రెడ్డి
  • వ్యవసాయం దండగ అన్నారని విమర్శ
  • 16 ఏళ్లు సీఎంగా ఉండి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్
16 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని, పూర్తి చేయలేదని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. 

వ్యవసాయ రంగానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో హంద్రీనీవా పూర్తి చేయాలని వైఎస్సార్ భావించారని చెప్పారు. 

ప్రాజెక్టులను నాశనం చేసిన చంద్రబాబు... మళ్లీ జగన్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు నుంచి హైకోర్టును, లా యూనివర్సిటీని తరలించారని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న ద్రోహం గురించి ప్రజలు ఆలోచించాలని చెప్పారు. 16 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Chandrababu Naidu
Gadikoata Srikanth Reddy
YS Jagan
Andhra Pradesh Politics
YSR
Irrigation Projects
Telugu Desam Party
YSRCP
AP High Court
Agriculture Andhra Pradesh

More Telugu News