Arshad Nadeem: నీరజ్ చోప్రాను ఓడించినందుకు బహుమతులు ఇచ్చినట్టు ప్రచారం.. అలాంటిదేమీ లేదన్న పాక్ ఆటగాడు అర్షద్ నదీమ్

Arshad Nadeem Denies Receiving Gifts for Defeating Neeraj Chopra
  • పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాను ఓడించి స్వర్ణం గెలుచుకున్న అర్షద్ నదీమ్
  • ఈ గెలుపుతో అతడికి ప్లాట్, రూ. 12.3 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్టు ప్రచారం
  • అవి ఫేక్ వార్తలని కొట్టిపడేసిన పాక్ ఆటగాడు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రాను ఓడించినందుకు తనకు అవార్డులు, రివార్డులు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని పాక్ జావెలిన్ త్రో బంగారు పతక విజేత అర్షద్ నదీమ్ ఖండించాడు. పాకిస్థాన్‌లోని కొందరు రాజకీయ నాయకులు, సంస్థలు కలిసి అర్షద్‌కు ఇస్లామాబాద్‌లో ఒక ప్లాట్‌తోపాటు రూ. 12.3 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.  

ఈ వార్తలను తీవ్రంగా ఖండించిన నదీమ్.. తనకు ఎలాంటి ప్లాట్ కానీ, బహుమతులు కానీ అందలేదని స్పష్టం చేశాడు. “నాకు ఇస్లామాబాద్‌లో ఎలాంటి ప్లాట్ ఇవ్వలేదు, ఇలాంటి బహుమతుల గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు” అని ఓ టీవీ చానల్‌తో చెప్పాడు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన మొదటి పాకిస్థానీ అథ్లెట్‌గా నిలిచిన నదీమ్.. తన విజయం దేశానికి గర్వకారణమని, కానీ ఈ బహుమతుల గురించిన వార్తలు తప్పుడు ప్రచారమని తెలిపాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో, నదీమ్ 92.97 మీటర్ల దూరంతో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించాడు. భారత ఆటగాడు నీరజ్ చోప్రాను (89.45 మీటర్లు) ఓడించి, ఒలింపిక్ రికార్డును సృష్టించాడు. 


Arshad Nadeem
Neeraj Chopra
Paris Olympics
Javelin Throw
Pakistan Athlete
Islamabad Plot
Awards
Rewards
Olympic Record

More Telugu News