Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు

Over 20 Delhi Schools Receive Bomb Threats Via Email says Police
  • స్కూళ్ల వ‌ద్ద బాంబు స్క్వాడ్స్ త‌నిఖీలు 
  • పాఠశాల తరగతి గదుల్లో పేలుడు పరికరాలంటూ బెదిరింపు మెయిల్స్ 
  • పేలుడు పదార్థాలను నల్లటి ప్లాస్టిక్ సంచులలో పెట్టిన‌ట్లు లేఖ‌ 
  • ఢిల్లీలో బెదిరింపు మెయిల్స్‌ రావ‌డం వారంలోనే ఇది మూడోసారి
దేశ రాజ‌ధాని ఢిల్లీలోని 20కి పైగా పాఠశాలలకు ఢిల్లీలో ఈ రోజు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. దీంతో ఆయా స్కూళ్ల వ‌ద్ద బాంబు స్క్వాడ్స్ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నాయి. బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చిన స్కూళ్ల‌లో సివిల్ లైన్స్‌లోని సెయింట్ గ్జావియ‌ర్స్, ప‌శ్చిమ్ విహార్‌లోని రిచ్‌మండ్ గ్లోబ‌ల్ స్కూల్‌, రోహిణిలోని అభిన‌వ్ ప‌బ్లిక్ స్కూల్‌, ద సావిరిన్ స్కూల్ ఉన్నాయి. 

పోలీసుల కథనం ప్రకారం, బాంబు బెదిరింపు లేఖలో... "హలో. నేను పాఠశాల తరగతి గదుల్లో అనేక పేలుడు పరికరాలను (ట్రినిట్రోటోలుయెన్) ఉంచానని మీకు తెలియజేస్తున్నాను. పేలుడు పదార్థాలను నల్లటి ప్లాస్టిక్ సంచులలో చాలా జాగ్ర‌త్త‌గా దాచిపెట్టాను. మీలో ప్రతి ఒక్కరినీ నేను ఈ ప్రపంచం నుంచి తుడిచివేస్తాను. ఒక్క ఆత్మ కూడా బ్రతకదు. నేను ఆ వార్తలను చూసినప్పుడు సంతోషంగా నవ్వుతాను. తల్లిదండ్రులు పాఠశాలకు రావడం.. వారి పిల్లల ఛిద్రమైన శరీరాల‌ను చూసి ఏడ‌వ‌డం చూస్తాను.

మీరందరూ బాధపడటానికి అర్హులు. నాకు నిజంగా నా జీవితం అసహ్యమే. తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా గొంతు కోసుకుంటాను, నా మణికట్టును కోసుకుంటాను. నాకు నిజమైన సహాయం ఎప్పుడూ అంద‌లేదు. మనోరోగ వైద్యులు, మనస్తత్వవేత్తలు ఇలా ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ పట్టించుకోరు కూడా. నిస్సహాయ మానవులకు మందులు ఇవ్వడం గురించి మాత్రమే మీరు శ్రద్ధ వహిస్తారు. 

ఆ మందులు మీ అవయవాలను నాశనం చేస్తాయని, బరువు పెరగడానికి కారణమవుతాయని మనోరోగ వైద్యులు మీకు ఎప్పుడూ చెప్పరు. మానసిక మందులు వారికి సహాయపడతాయని మీరు ప్రజలను ఆలోచించేలా చేస్తారు. కానీ వారు అలా చేయరు. వారు అలా చేయరనడానికి నేను ప్రత్యక్ష రుజువును. మీరందరూ దీనికి అర్హులు. మీరు నాలాగే బాధపడటానికి అర్హులు" అని లేఖలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

కాగా, బుధ‌వారం కూడా సుమారు ఏడు స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలో బెదిరింపు మెయిల్స్‌ రావ‌డం వారంలోనే ఇది మూడోసారి. మంగ‌ళ‌వారం ఉద‌యం నార్త్ క్యాంప‌స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ద్వార‌క‌లోని సెయింట్ థామ‌స్ స్కూల్‌కు బెదిరింపులు వ‌చ్చాయి.
Delhi Schools
Delhi
School Bomb Threat
Bomb Threat
Delhi School Bomb Threat
St Xavier's School
Richmond Global School
Abhinav Public School
The Sovereign School

More Telugu News