పోలీస్ స్టేషన్ కు రావాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్యను బెదిరిస్తున్నారు: దాసోజు శ్రవణ్
- తెలంగాణలో ఎనుముల రాజ్యాంగం నడుస్తోందన్న శ్రవణ్
- బీఆర్ఎస్ కార్యకర్తలపై 5 వేల కేసులు పెట్టారని మండిపాటు
- కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ కు ఏం పని అని ప్రశ్న
మన రాష్ట్రంలో ప్రశ్నించడానికి, నిరసన తెలపడానికి కూడా హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ రెడ్డికి ఏం పని అని ప్రశ్నించారు. హోంశాఖపై రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రివ్యూ చేయలేదని విమర్శించారు. రేవంత్ కు చేతకాకపోతే హోంశాఖను వేరేవారికి అప్పగించాలని అన్నారు. సిట్ పేరుతో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.