పేర్ని నాని పిటిషన్ తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు
- ఇటీవల పామర్రులో పేర్ని నాని వ్యాఖ్యలు
- రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ టీడీపీ నేతల ఫిర్యాదు
- హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని
- తదుపరి విచారణ జులై 22కి వాయిదా
జులై 8న పామర్రులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో పేర్ని నాని రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. తనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఉన్నత న్యాయస్థానంలో ఆయనకు చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది.