Miss Golf: బౌద్ధ సన్యాసులకు వలపు వల.. ప్రైవేట్ వీడియోలతో రూ.102 కోట్లు కొల్లగొట్టిన యువతి

Miss Golf Blackmails Buddhist Monks in Thailand for 12 Million
  • థాయ్‌లాండ్‌లో ఘటన
  • 9 మంది సన్యాసులతో సంబంధాలు ఏర్పరచుకున్న యువతి
  • ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన యువతి
థాయ్‌లాండ్‌లో ఓ యువతి బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకొని, వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. వాటితో వారిని బ్లాక్‌మెయిల్ చేసి మూడేళ్లలో వారి నుంచి రూ. 102 కోట్లు వసూలు చేసింది. తొమ్మిది మంది సన్యాసులను ప్రలోభపెట్టిన ఆ మహిళకు పోలీసులు 'మిస్ గోల్ఫ్' అని పేరు పెట్టారు.

ఆమె ఇంటిని సోదా చేసిన పోలీసులకు దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. ఆ సన్యాసులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించిన 80,000 కంటే ఎక్కువ ఫొటోలు, వీడియోలను గుర్తించారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో సన్యాసులు లైంగిక, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు అధికమయ్యాయి. ఇప్పుడు ఈ ఘటన అక్కడి బౌద్ధ సంస్థను మరింతగా కుదిపేసింది.

జూన్ నెలలో ఒకరు సన్యాసానికి దూరమయ్యారు. దీంతో పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించారు. 2024 మేలో మిస్ గోల్ఫ్ ఒక సన్యాసితో సంబంధం ఏర్పరుచుకుంది. వారికి ఒక బిడ్డ కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఖర్చుల కోసం రూ. 1.81 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసింది.

ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా, మరికొందరు సన్యాసులతోనూ ఆమె ఇలాగే వ్యవహరించినట్లు వెల్లడైంది. వారి నుంచి తీసుకున్న డబ్బులో కొంత భాగాన్ని జూదానికి ఉపయోగించిందని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆమెపై పోలీసులు మనీలాండరింగ్, దోపిడీ తదితర కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై థాయ్ బౌద్ధానికి సంబంధించిన పాలక సంస్థ సంఘ సుప్రీం కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. సన్యాసుల విషయంలో ఉన్న నియమ నిబంధనలను సమీక్షిస్తామని తెలిపింది.
Miss Golf
Thailand
Buddhist monks
blackmail
extortion
money laundering
sex scandal

More Telugu News