Sridhar Babu: రేవంత్ రెడ్డి బలమైన, విజనరీ నాయకుడు: శ్రీధర్ బాబు

Telangana CM Revanth Reddy a Strong Leader Says Sridhar Babu
  • సీఎంగా రేవంత్ పేరును ప్రకటించినప్పుడు అందరం కలిసి పని చేయాలని నిర్ణయించామన్న శ్రీధర్ బాబు
  • ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న నేత రేవంత్ అని కితాబు
  • సీఎం కావాలని ఎన్నో ఏళ్లుగా రేవంత్ కోరుకున్నారని వెల్లడి
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ నిర్ణయించినప్పుడు జరిగిన పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. రేవంత్ పేరును హైకమాండ్ నిర్ణయించినప్పుడు అందరం కలిసి పని చేయాలని, ఆ నాయకుడికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందించాలని ఆలోచించామని చెప్పారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాల మేరకే తామంతా నడుస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి మంచి నాయకుడని, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నారని చెప్పారు.

గత ఏడాదిన్నర కాలంగా రేవంత్ ను దగ్గరగా ఉండి చూస్తున్నామని... ఒక బలమైన, విజనరీ నాయకుడి లక్షణాలు రేవంత్ లో కనిపిస్తున్నాయని కితాబునిచ్చారు. సీఎం కావాలని ఎన్నో ఏళ్లుగా రేవంత్ కోరుకున్నారని... ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలతో శ్రమించారని తెలిపారు. దానికి తోడు ఆయన ప్లానింగ్, టైమ్, అవకాశాలు అన్నీ కలిసి వచ్చాయని చెప్పారు. 

ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత మరొకటి పూర్తి చేసే పనిలో తాము ఉన్నామని తెలిపారు. ఆ లక్ష్య సాధనలో అనేక పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. 
Sridhar Babu
Revanth Reddy
Telangana CM
Congress Party
Telangana Politics
Visionary Leader
Telangana Government
Political Interview

More Telugu News