Ciel Dubai Marina: దుబాయ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన హోటల్.. ప్ర‌త్యేక‌త‌లు తెలిస్తే ఔరా అనాల్సిందే!

Worlds Tallest Hotel Is Set To Debut In Dubai
  • 1,197 అడుగుల ఎత్తుతో సీల్ దుబాయ్ మెరీనా హోట‌ల్‌
  • ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్న ప్రపంచంలోనే ఎత్తైన హోటల్
  • ఈ ఆకాశహర్మ్యంలో 82 అంతస్తులు, 147 సూట్‌లతో సహా 1,004 గదులు
దుబాయ్‌లో మరో ఆకాశహర్మ్యం క‌నువిందు చేయ‌నుంది. ఈ నగరం త్వరలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్‌ను ప్రారంభించ‌డానికి సిద్ధ‌మైంది. 1,197 అడుగుల (365 మీటర్లు) ఎత్తుతో ఉన్న సీల్ దుబాయ్ మెరీనా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

సీల్ దుబాయ్ మెరీనా ప్ర‌త్యేక‌త‌లివే
ది ఫస్ట్ గ్రూప్ అభివృద్ధి చేసిన సీల్ దుబాయ్ మెరీనాలో 82 అంతస్తులు, 147 సూట్‌లతో సహా సుమారు 1,004 గదులు ఉంటాయి. వీటిని ప్రసిద్ధ NORR గ్రూప్ రూపొందించింది. సీల్ దాని అత్యాధునిక ఆర్కిటెక్చర్, ఆతిథ్యంతో లగ్జరీ స్కైలైన్ అనుభవాలను అందించ‌డానికి ప్రయత్నిస్తుంది.

సీఆర్‌ 18వ బ్యూరో గ్రూప్ ఆఫ్ దుబాయ్ (CR18BG) ప్రకారం, హోటల్ సీల్ 12 అంతస్తుల 'ఏట్రియం స్కై గార్డెన్', 1,158 అడుగుల ఎత్తైన 'స్కై రెస్టారెంట్', భూమి నుంచి 1,004 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన ఇన్ఫినిటీ పూల్‌ను కూడా కలిగి ఉంది. ఇక‌, నేల నుంచి పైకప్పు వరకు ఉన్న గాజు కిటికీలు అతిథులకు పర్షియన్ గల్ఫ్ 360 డిగ్రీల వ్యూను అందిస్తాయి.
Ciel Dubai Marina
Dubai
World's tallest hotel
Hotel opening
Luxury hotel
Dubai Marina
Sky restaurant
Infinity pool
Persian Gulf view
The First Group

More Telugu News