కేసులు కొట్టివేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్.. హైకోర్టులో విచారణ!
- ఎన్నికల సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసులు
- నేరేడుచర్ల, మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లలో కేసులు
- కేసులు కొట్టివేయాలని మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన మంత్రి
- తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన హైకోర్టు
నేరేడుచర్ల, మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మంత్రి మూడు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు.