Rana Daggubati: 'బాహుబ‌లి' ర‌న్‌టైమ్‌పై పుకార్లు.. రానా ఏమ‌న్నారంటే..!

Rana Daggubati Responds to Baahubali The Epic Runtime Rumors
  • పదేళ్లు పూర్తి చేసుకున్న ‘బాహుబలి’ 
  • ఈ అపురూప ఘట్టాన్ని పురస్కరించుకొని మూవీ రీరిలీజ్
  • రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో విడుద‌ల‌
  • ఈ ఏడాది అక్టోబర్ 31న మరోసారి వెండితెరపైకి విజువల్ వండర్ 
  • ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత మూవీ ర‌న్‌టైమ్‌పై రూమ‌ర్స్
  • ర‌న్‌టైమ్ ఎంత అనే విష‌యం త‌న‌కు కూడా తెలియ‌దన్న రానా
ప్రపంచ సినిమా హిస్ట‌రీలో తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాలకు చేర్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బాహుబలి’ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ అపురూప ఘట్టాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఇటీవ‌ల ఒక కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 31న ఈ విజువల్ వండర్ మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది.

ఇక‌, ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌ర్వాత నుంచి ఈ మూవీ ర‌న్‌టైమ్ విష‌యంలో ర‌క‌ర‌కాల రూమ‌ర్స్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీని నిడివి ఐదు గంట‌ల‌కు పైగానే ఉంటుంద‌ని కొంద‌రు, 4 గంట‌లు అని మ‌రికొంద‌రు పోస్టులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌టుడు రానా స్పందించారు. ఈ సినిమాలో భ‌ల్లాల దేవ పాత్ర‌లో రానా అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. 

‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ర‌న్‌టైమ్ పుకార్ల‌పై ఆయ‌న స్పందిస్తూ... "ఎంత నిడివి ఉన్నా నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ మూవీలో న‌టించ‌కుండానే నాకు బ్లాక్‌బ‌స్ట‌ర్ రానుంది. ర‌న్‌టైమ్ ఎంత అనే విష‌యం నాకు కూడా తెలియ‌దు. 4 గంట‌లు అని పోస్టులు పెడుతున్నారు. 

అంత నిడివి ఉంటే చూస్తారా! సినిమా ర‌న్‌టైమ్ కేవ‌లం జ‌క్క‌న్న‌కు మాత్ర‌మే తెలుసు. ఆయ‌న చెప్పేవ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌దు. నాకైతే ఆయ‌న ఏం చెప్ప‌లేదు" అని రానా అన్నారు. దీంతో ఈ మూవీ ర‌న్‌టైమ్ చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.  
Rana Daggubati
Baahubali The Epic
Baahubali
SS Rajamouli
Prabhas
Baahubali runtime
Telugu cinema
Bhalla Deva
Indian movies
box office hit

More Telugu News