infanticide: బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన యువతి.. మహారాష్ట్రలో దారుణం

Newborn baby dies after being thrown from bus in Maharashtra
  • తీవ్రగాయాలతో పసికందు మృతి
  • బస్సును ఆపి ప్రయాణికులను చెక్ చేసిన పోలీసులు
  • 19 ఏళ్ల యువతితో పాటు యువకుడి అరెస్ట్
  • బిడ్డను పెంచే స్తోమత లేక పారేశామన్న యువకుడు
మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రయాణంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన యువతి.. ఆ పసికందును కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. దీంతో గాయాలపాలైన ఆ పసికందు అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు బస్సును ఆపి తనిఖీ చేశారు. పందొమ్మిదేళ్ల యువతిని, ఆమెతో పాటు ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పర్భణికి చెందిన రితిక ధీరే, అల్తాఫ్ షేక్ లు కొంతకాలంగా పూణేలో జీవిస్తున్నారు. ఈ క్రమంలో రితిక గర్భం దాల్చింది. తాజాగా సోమవారం రాత్రి నిండు గర్భిణి రితికతో అల్తాఫ్ పర్భణి బయలుదేరాడు. స్లీపర్ కోచ్ లో రాత్రంతా ప్రయాణించారు. తెల్లవారుజామున రితికకు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. పథ్రి- సేలు రోడ్డులో ప్రయాణిస్తుండగా బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను అల్తాఫ్ ఓ గుడ్డలో చుట్టి కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు.

బస్సులో నుంచి ఏదో వస్తువు పడడం చూసిన స్థానికుడు దగ్గరికి వెళ్లి పరిశీలించాడు. అందులో పసిబిడ్డను చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన పోలీసులు ఆ బస్సును ఆపి రితిక, అల్తాఫ్ లను అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం రితికను ఆసుపత్రిలో చేర్పించి అల్తాఫ్ ను విచారించారు. తాము భార్యాభర్తలమని, బిడ్డను పెంచే స్తోమత లేకపోవడం వల్లే ఈ పని చేశామని అల్తాఫ్ చెప్పుకొచ్చాడు. అయితే, వారిద్దరూ భార్యాభర్తలు అనేందుకు ఎలాంటి ఆధారం చూపలేకపోయాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
infanticide
bus incident
Maharashtra
Ritika Dhire
Maharashtra crime
Parbhani
Altaf Sheikh
baby thrown from bus
crime news
Pune

More Telugu News