మల్లు భట్టివిక్రమార్కకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లీగల్ నోటీసులు
- రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై రామచందర్ రావుపై ఆరోపణలు
- తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ అధ్యక్షుడి డిమాండ్
- లేదంటే రూ. 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు మల్లు భట్టివిక్రమార్క మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రూ. 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. క్షమాపణ చెప్పని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు.