Swathi: సినీ ఫక్కీలో భర్త హత్య... భార్య, ప్రియుడు అరెస్టు

Swathi arrested for husbands murder in Yadadri Bhuvanagiri
  • తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
  • ముగ్గురి అరెస్టు.. పరారీలో ఒక నిందితుడు
  • ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారుతో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసును పోలీసులు ఛేదించారు. సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్యతో పాటు ఆమె ప్రియుడు, మరో ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు రామలింగస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన స్వామి హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. భార్య స్వాతి, ఆమె ప్రియుడు సాయికుమార్, సోదరుడు మహేశ్‌, ఇతరులతో కలిసి ఈ హత్యకు పథకం పన్నినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న స్వామిని కారుతో ఢీకొట్టించి, అది ప్రమాదవశాత్తు జరిగిందని చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై పోలీసులు హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద స్వాతి, సాయికుమార్, మహేశ్‌పై కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి మూడు ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాతి కారును అద్దెకు తీసుకొని భర్తను హత్య చేయించింది.
Swathi
Yadadri Bhuvanagiri
Telangana Crime
Husband Murder
Sai Kumar
Extra Marital Affair
Crime News
Pallerla Village

More Telugu News