Mitchell Starc: 100వ టెస్టులో వరల్డ్ రికార్డు నమోదు చేసిన స్టార్క్

Mitchell Starc Sets World Record in 100th Test
  • వెస్టిండీస్ పై ఆసీస్ ఘన విజయం
  • 204 పరుగుల ఛేజింగ్ లో 27 పరుగులకే కుప్పకూలిన విండీస్
  • 15 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టిన స్టార్క్
  • అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. కింగ్స్‌టన్ సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఎర్నీ తోషాక్, స్టువర్ట్ బ్రాడ్, స్కాట్ బోలాండ్ (19 బంతులు) పేరిట ఉంది. 

ఈ టెస్టులో 204 పరుగుల లక్ష్యఛేదనతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 27 పరుగులకే కుప్పకూలింది. స్టార్క్ మొత్తం 6 వికెట్లు  తీయగా, స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ ఇన్నింగ్స్ లో ఏడుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. జస్టిన్ గ్రీవ్స్ చేసిన 11 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. ఇక ఇదే మ్యాచ్ తో స్టార్క్ టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆసీస్ బౌలర్ గా నిలిచాడు.
Mitchell Starc
Mitchell Starc 100th Test
Australia Cricket
West Indies Cricket
Fastest 5 Wicket Haul
Test Cricket Record
Scott Boland
Kingston Sabina Park
Cricket Records

More Telugu News