యుద్ధాలను ఆపడంలో నేనే మొనగాడిని: ట్రంప్.. వీడియో ఇదిగో!
- భారత్ - పాక్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ మరోమారు వ్యాఖ్య
- వర్తకంపై ఆంక్షల పేరుతో రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చా
- రువాండా - కాంగోల మధ్య సుదీర్ఘ వివాదాన్నీ పరిష్కరించానని ట్రంప్ వెల్లడి
యుద్ధం ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని, భవిష్యత్తులో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబోమని ఒత్తిడి చేశానని వివరించారు. దీంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని, ప్రపంచానికి మరో అణు యుద్ధ ముప్పు తప్పిందని ట్రంప్ తెలిపారు. రువాండా - కాంగోల మధ్య గడిచిన 30 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం గురించి ప్రపంచం మొత్తానికీ తెలుసని ట్రంప్ గుర్తుచేశారు. ఇందులో సుమారు 70 లక్షల మంది చనిపోయారని ట్రంప్ చెప్పారు. ఈ వివాదాన్ని కూడా తాను సమసిపోయేలా చేశానని చెప్పుకున్నారు. ఈమేరకు సోమవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.