Stock Market: మధ్యాహ్నం బాంబులు పేలుతాయి!: బాంబే స్టాక్ ఎక్స్చేంజీకి బెదిరింపు మెయిల్

Bomb Threat to Bombay Stock Exchange
  • ఈరోజు మూడు గంటలకు పేలుళ్లు సంభవిస్తాయని మెయిల్
  • 'కామ్రేడ్ పినరాయి విజయన్' పేరుతో ఉన్న మెయిల్ ఐడీ నుంచి బెదిరింపు సందేశం
  • ఎక్స్చేంజీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్
  • అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని వెల్లడి
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌కి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం ఎక్స్చేంజీలో బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటాయని బెదిరింపు సందేశం రావడంతో కలకలం రేగింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్చేంజీ భవనంలో పేలుళ్లు సంభవిస్తాయని 'కామ్రేడ్ పినరాయి విజయన్' పేరుతో ఉన్న మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని తెలిపారు. ఇది నకిలీ బాంబు బెదిరింపు కావొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని పలు కళాశాలలకు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలకు, సెయింట్ థామస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Stock Market
Bombay Stock Exchange
Bomb Threat

More Telugu News