Vaishnavi: గండికోటలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

BTech Student Vaishnavi Found Dead in Gandikota
  • ఒక యువకుడితో కలిసి పల్సర్ బైక్ పై గండికోటకు వచ్చిన యువతి
  • ఆమె దుస్తులతోనే గొంతు బిగించి చంపినట్టు అనుమానిస్తున్న పోలీసులు
  • యువతితో వచ్చిన యువకుడి కోసం గాలింపు
కడప జిల్లా గండికోట వద్ద ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.... నిన్న సాయంత్రం సదరు యువతి ఒక యువకుడితో కలిసి పల్సర్ బైక్ పై గండికోటకు వచ్చింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలిని ప్రొద్దుటూరుకు చెందిన వైష్ణవిగా గుర్తించారు. ఆమె ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోందని పోలీసులు తెలిపారు.

మరోవైపు యువతితో వచ్చిన యువకుడిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వేసుకున్న దుస్తులతోనే గొంతు బిగించి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వైష్ణవితో వచ్చిన యువకుడు కాసేపటికే ఒక్కడే తిరిగివెళ్లాడు. పోలీసులు పలుచోట్ల సాక్ష్యాలను సేకరిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Vaishnavi
Kadapa district
Gandikota
B.Tech student death
Suspicious death
Proddutur
Engineering college
Andhra Pradesh crime
Murder investigation
Pulsar bike

More Telugu News