Varun Aaron: సన్‌రైజర్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చాడు... మనోడే!

Varun Aaron Appointed Sunrisers Hyderabad Bowling Coach
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ గా భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ 
  • వరుణ్ నియామకంపై ప్రకటన చేసిన సన్‌రైజర్స్  
  • ఇండియా – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు వరుణ్ కామెంటరీ చెబుతుండగా విడుదలైన సన్‌రైజర్స్ ప్రకటన
భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యారు. 2026 సీజన్‌కు గాను వరుణ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు సన్‌రైజర్స్ ప్రకటించింది.

ఐపీఎల్ 2025లో పేలవమైన ప్రదర్శనతో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నష్టాలను ఎదుర్కొన్న అనంతరం ఫ్రాంచైజీ కీలక మార్పులు చేపట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా ప్రఖ్యాత పేసర్ డేల్ స్టెయిన్ తప్పుకున్న తర్వాత న్యూజిలాండ్ ఎడమచేతి వాటం మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అతని హయాంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో మార్పుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా కొత్త బౌలింగ్ కోచ్‌గా మాజీ భారత్ పేసర్ వరుణ్‌ను నియమించింది.

2011-2015లో తొమ్మిదేసి టెస్టులు, వన్డేల్లో భారత్‌కు వరుణ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది జనవరి 5న గోవాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో జార్ఖండ్ తరపున అతను చివరిసారిగా బరిలో దిగారు. ఇటీవల కాలంలో కామెంటరీ బాక్స్‌లో తన అద్భుతమైన క్రికెట్ జ్ఞానం, వ్యూహాత్మక ఆలోచనలతో వరుణ్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వరుణ్ ఇంగ్లాండ్‌లో ఇండియా - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు కామెంటరీ చెబుతుండగానే ఆయన నియామకానికి సంబంధించి సన్‌రైజర్స్ ప్రకటన విడుదలైంది. 
Varun Aaron
Sunrisers Hyderabad
SRH
IPL 2025
Bowling Coach
Dale Steyn
James Franklin
Indian Premier League
Cricket
Vijay Hazare Trophy

More Telugu News