Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంటి క్రమబద్ధీకరణపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
తన ఇంటిని క్రమబద్దీకరించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న దరఖాస్తుపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 455 ఏఏ కింద జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని తన ఇంటిని క్రమబద్ధీకరించాలంటూ జూన్ 5న చిరంజీవి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దీనిపై జీహెచ్ఎంసీ ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పిటిషన్‌ను నిన్న విచారించిన న్యాయస్థానం ఆయన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది.