Nara Lokesh: ర్యాంకర్లను సన్మానించిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Felicitates NEET JEE Advanced Rankers in Andhra Pradesh
  • జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థుల సత్తా
  • ఉండవల్లి నివాసంలో విద్యార్థులను కలిసిన మంత్రి నారా లోకేశ్
  • రాష్ట్రానికి గర్వకారణంలా నిలిచారని అభినందనలు
నీట్ యూజీ, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. రాజమండ్రికి చెందిన డి.కార్తీక్ రామ్ నీట్ యూజీ పరీక్షలో ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 19వ ర్యాంక్, ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 113వ ర్యాంక్, రాజమండ్రికి చెందిన కంచుమర్తి ప్రణీత్ 311వ ర్యాంక్ సాధించారు.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో ఈ విద్యార్థులను కలిసిన మంత్రి నారా లోకేశ్, వారి ప్రతిభకు ముగ్ధులైనట్లు తెలిపారు. "తమ కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు" అని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాధనను కొనియాడిన మంత్రి, రాష్ట్రంలోని ఇతర విద్యార్థులకు వారు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.


Nara Lokesh
AP Education Minister
NEET UG
JEE Advanced
Andhra Pradesh students
D Karthik Ram
Kotipalli Yashwanth Sathvik
Kanchumarthi Praneeth
Rankers felicitated
Education Andhra Pradesh

More Telugu News