Aupresh Kumar Singh: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్

Aupresh Kumar Singh Appointed as Telangana High Court Chief Justice
  • దేశంలో పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీలు
  • ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ బట్టు దేవానంద్ 
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించడంతో కేంద్ర న్యాయశాఖ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావును త్రిపుర హైకోర్టుకు, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కే. ఆర్. శ్రీరామ్‌ను రాజస్థాన్‌కు, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మణింద్ర మోహన్ శ్రీవాస్తవను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బట్టు దేవానంద్‌ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన గతంలోనూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.
Aupresh Kumar Singh
Telangana High Court
Chief Justice
Transfer
Droupadi Murmu

More Telugu News