Chirla Jaggireddy: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మిస్సయింది: చిర్ల జగ్గిరెడ్డి

Chirla Jaggireddy One Thing Was Missed During YSRCP Rule
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి 
  • గతంలో కార్యకర్తలకు తగినంత గౌరవం లభించలేదని వెల్లడి
  • ఆ లోటుపాట్లను చక్కదిద్దుకుంటామని స్పష్టీకరణ
  • ప్రతి కార్యకర్తకు వైసీపీ నాయకత్వం బీమా సౌకర్యం కల్పిస్తోందని వివరణ
అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలకు గౌరవం మరియు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను గౌరవించడంలో కొన్ని లోటుపాట్లు జరిగాయని, అయితే ఈసారి వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తను గౌరవించేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, "అదేదో సినిమాలో క్యారెక్టర్‌ చెప్పినట్టు, గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మిస్సయింది. అదేంటంటే... కార్యకర్తలను గౌరవించడం! అది మిస్సయింది. ఈసారి జగన్‌ గారిని మళ్లీ అధికారంలోకి తెచ్చిన తర్వాత, ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం ఇవ్వడమే కాకుండా, వారందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది" అని వెల్లడించారు.

ఈ నిర్ణయం కార్యకర్తల బాగోగులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జగన్ కూడా దీనిపై ఆలోచన చేశారని, గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటు పూర్తయిన వెంటనే ఈ బీమా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని వెల్లడించారు. ఈ చర్య ద్వారా పార్టీ కార్యకర్తలకు ఆర్థిక భద్రతను అందించడంతో పాటు, వారి సేవలను గుర్తించి గౌరవించే లక్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోందని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.
Chirla Jaggireddy
YSRCP
YSR Congress
Andhra Pradesh Politics
Jagan Mohan Reddy
Party Workers
Insurance Scheme
Political News
Ambedkar Konaseema District

More Telugu News