Russia: రష్యాలోని ఆ ప్రాంతంలో 10 లక్షల మంది భారతీయులకు ఉపాధి

Russia to Employ 1 Million Indian Workers by Year End
  • కార్మిక శక్తి కొరతను అధిగమించేందుకు భారత్ వైపు రష్యా దృష్టి
  • ఉరల్ పర్వత సమీపంలోని యాకటెరిన్ బర్గ్ ప్రాంతంలో కార్మికుల కొరత
  • యాకటెరిన్ బర్గ్‌లో కొత్త కాన్సులేట్ జనరల్ ప్రారంభించనున్న రష్యా
ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులకు రష్యా ఉపాధి కల్పించనున్నట్లు సమాచారం. తమ దేశంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికశక్తి కొరతను అధిగమించేందుకు రష్యా భారత్ వైపు దృష్టి సారిస్తోంది. రష్యాలో యాకటెరిన్‌బర్గ్‌ నగరంలో ఒక నూతన కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఇది వలస కార్మికులకు సంబంధించిన అంశాలను పరిశీలించనుంది. ఈ మేరకు ఉరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ బెసెడిన్ మీడియాకు తెలియజేశారు.

రష్యాలోని ఉరల్ పర్వతాలు సమీపంలో యాకటెరిన్‌బర్గ్ ప్రాంతం ఉంది. ఇది భారీ పరిశ్రమలకు కేంద్రం. అక్కడ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ ప్రాంతంలోని పరిశ్రమలు ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఉందని అండ్రీ బెసెడిన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు శ్రీలంక, ఉత్తర కొరియా నుంచి కార్మికులను రప్పించాలని రష్యా భావిస్తోంది. రష్యాలో కార్మికుల కొరత ఉన్నందున భారత్‌తో సహా ఇతర దేశాల వైపు చూస్తోంది.
Russia
Indian Workers in Russia
Russia Jobs
Yekaterinburg
Andrey Besedin

More Telugu News