Mohsin Naqvi: పాకిస్థాన్ క్రికెట్లో సంక్షోభం.. భారీ అవినీతి భాగోతం బట్టబయలు!

Mohsin Naqvi Pakistan Cricket Board faces corruption scandal
  • పాక్ క్రికెట్ లో రూ.600 కోట్లకు పైగా స్కామ్!
  • ఆడిట్ రిపోర్ట్ ద్వారా వెల్లడి
  • తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పీసీబీ
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో భారీ ఆర్థిక అవినీతి, అక్రమ నియామకాల భాగోతం బట్టబయలైంది. ఈ మేరకు ఆడిటర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ నిర్వహించిన ఆడిట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఈ అవకతవకలు మొత్తం 600 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. ఈ ఆడిట్ నివేదిక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన లోపాలను బయటపెట్టింది. దీనితో బోర్డు ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.

ఆడిట్ రిపోర్ట్ ప్రకారం, టికెటింగ్ కాంట్రాక్టులు, మీడియా హక్కులు, బ్రాడ్‌కాస్టింగ్ ఒప్పందాలు పారదర్శకత లేకుండా కేటాయించినట్టు  గుర్తించారు. రూ.500 కోట్ల స్పాన్సర్‌షిప్ మొత్తం రికవరీ కాకపోవడం ఆడిట్‌లో బయటపడింది. అలాగే, రూ.43.9 కోట్ల మీడియా హక్కులను రిజర్వ్ ధర కంటే తక్కువకు ఇచ్చినట్లు గుర్తించబడింది. అలాగే,

అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో భద్రత కోసం పోలీసులకు భోజన ఖర్చుల కింద రూ.6.3 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ఇది అనవసరమైన ఖర్చుగా గుర్తించబడింది. అంతేకాక, మ్యాచ్ అధికారులకు రూ.38 లక్షల అధిక చెల్లింపులు, మీడియా డైరెక్టర్‌ను నెలకు 9 లక్షల రూపాయలతో నియమించడం వంటి అక్రమ నియామకాలు కూడా జరిగాయని వివరించింది. 

ఇంకా, 2023 ఫిబ్రవరి నుంచి జూన్ 2024 వరకు పీసీబీ చైర్మన్‌కు యుటిలిటీ ఛార్జీలు, ఇంధనం, వసతి కోసం రూ.41 లక్షలు అనధికారంగా చెల్లించినట్లు రిపోర్ట్ వెల్లడించింది. ఈ చెల్లింపులు పీసీబీ చైర్మన్ మొహిసిన్ నక్వీ పాక్ హోం మంత్రిగా ఉన్న సమయంలో జరిగాయని, ఇది చట్టవిరుద్ధమని ఆడిట్ రిపోర్ట్ పేర్కొంది.

ఈ అవకతవకలు పీసీబీలో దీర్ఘకాలంగా నడుస్తున్న అవినీతి, రాజకీయ జోక్యం, మరియు నిర్వహణ లోపాలను సూచిస్తున్నాయి. పాకిస్తాన్ ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో శక్తివంతమైన టీమ్ గా గుర్తింపు పొందినప్పటికీ, ఇటువంటి ఆర్థిక అక్రమాలు మరియు నిర్వహణ సమస్యల కారణంగా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. తాజాగా ఆడిట్ రిపోర్ట్ బయటకు రావడంతో, పాకిస్థాన్ క్రికెట్ మరోసారి సంక్షోభంలో చిక్కుకుంది.
Mohsin Naqvi
Pakistan cricket
PCB
cricket board corruption
financial irregularities
audit report
Pakistan cricket board
sports corruption
Pakistan cricket crisis
cricket governance

More Telugu News