Nimisha Priya: యెమెన్‌లో ఉరిశిక్ష పడిన 'నిమిష' విషయంలో కేంద్రం ఏమన్నదంటే?

Nimisha Priya Death Sentence Centers Response in Yemen
  • 'నిమిష' ఉరిశిక్షను ఆపడానికి మన వద్ద మార్గాలు లేవన్న కేంద్ర ప్రభుత్వం
  • ప్రైవేటు సంప్రదింపుల ద్వారా మాత్రమే చర్చించగలమని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
  • ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది బాధాకరమన్న న్యాయమూర్తి
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. నర్సు ఉరిశిక్షను ఆపడానికి ఇప్పుడు మన వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భారత్-యెమెన్‌ల మధ్య దౌత్య సంబంధాలు లేవని, ఉరిశిక్షను వాయిదా వేయడం లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్‌కు లేఖ రాసినట్లు అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు.

యెమెన్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదని తెలిపారు. ప్రైవేటు సంప్రదింపుల ద్వారా మాత్రమే చర్చించగలమని కోర్టుకు తెలిపారు.

న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ, ఈ ఘటన చోటుచేసుకున్న విధానం చాలా బాధాకరమని, ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది విచారకరమని వ్యాఖ్యానించారు.

నిమిష ప్రాణాలను కాపాడాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిన్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆమెను విడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖను పంపించారు. నిమిష విషయంలో ఈ నెల 10న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Nimisha Priya
Kerala Nurse
Yemen
Death Sentence
Pinarayi Vijayan
S Jaishankar
Supreme Court
India Yemen Relations

More Telugu News