B Saroja Devi: ఆ ముగ్గురితో బి. సరోజా దేవిది హిట్ పెయిర్: నందమూరి బాలకృష్ణ

B Saroja Devi Death Balakrishna Pays Tribute
  • అలనాటి ప్రఖ్యాత నటి బి. సరోజా దేవి కన్నుమూత
  • ఆమె మరణ వార్త అత్యంత బాధాకరమన్న బాలకృష్ణ
  • ఎన్టీఆర్ తో ఆమె 20 ఏళ్లలో 20 సినిమాల్లో నటించారని వెల్లడి
ప్రముఖ నటీమణి బి. సరోజాదేవి పరమపదించారన్న వార్త చిత్ర పరిశ్రమను విషాదానికి గురిచేసింది. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో తన అసాధారణ నటనతో ప్రేక్షక హృదయాలను ఆకర్షించిన ఆమె, అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. బి.సరోజా దేవి మరణంపై టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. 

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకనాడు ధ్రువతారగా వెలుగొందిన ప్రముఖ నటీమణి 'పద్మభూషణ్' బి. సరోజాదేవి గారు పరమపదించారన్న వార్త అత్యంత బాధాకరం. అప్పట్లో తెలుగులో ఎన్టీఆర్ గారితో, తమిళంలో ఎంజీఆర్ గారితో, కన్నడంలో రాజ్ కుమార్ గారితో ఏకకాలంలో హిట్ పెయిర్ గా వెలుగొందిన ఘనత ఆమెది. 

మా తండ్రి ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ఆయనతో శ్రీరాముడి పక్కనప్ర సీతాదేవిగా, రావణాసురుడి పక్కన మండోదరిగానూ నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. బి. సరోజా దేవి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీవ్ర విచారకరమైన పరిణామం. 

ఆమె వెండితెరపై, నిజజీవితంలో చేసిన సేవలు రాబోయే తరాల తారలకు, చలనచిత్ర వర్గాల వారికి స్ఫూర్తినిస్తాయి.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" అని బాలకృష్ణ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
B Saroja Devi
Nandamuri Balakrishna
NTR
MGR
Rajkumar
Tollywood actress
South Indian cinema
Padma Bhushan
actress death
Telugu cinema

More Telugu News