Tejashwi Yadav: చదువులేని మొద్దు.. తేజస్వీ యాదవ్ ‘సూత్ర’ వ్యాఖ్యపై బీజేపీ ఆగ్రహం

Tejashwi Yadav Remarks on Modi Spark BJP Outrage
  • మోదీని ఉద్దేశించి ‘సూత్ర’ పదాన్ని ఉపయోగించిన తేజస్వీ యాదవ్
  • మోదీని అవమానించడంతోపాటు ఓ కులాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న బీజేపీ
  • క్షమాపణలు చెప్పాల్సిందేనన్న బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ జైస్వాల్
  • తన వ్యాఖ్యలను సమర్థించుకున్న తేజస్వీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఆర్జేడీ నాయకుడు ‘సూత్ర’ (సూత్రధారి) అనే పదం ఉపయోగించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ జైస్వాల్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలను ఆయన అవమానకరమైనవిగా పేర్కొన్నారు.  తేజస్వీ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం బీహార్ రాజకీయాల్లో మరోమారు దుమారం రేపింది. 

ఈ నెల 12న బీహార్ శాసనసభలో జరిగిన చర్చల సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘సూత్ర’ అని సంబోధించారు. ఈ వ్యాఖ్యను బీజేపీ నాయకుడు సంజయ్ జైస్వాల్ అవమానకరంగా భావించారు. ‘సూత్ర’ అనే పదం హిందీలో ‘సూత్రధారి’ లేదా ‘మాస్టర్‌మైండ్’ అనే అర్థంతో పాటు, కొన్ని సందర్భాలలో కుల ఆధారిత అవమానకరమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ప్రధాని మోదీని అవమానించే ఉద్దేశంతోనే తేజస్వీ ఈ పదాన్ని ఉపయోగించారని జైస్వాల్ ఆరోపించారు.

తేజస్వీ యాదవ్ చదువులేని మొద్దు అని జైస్వాల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ గౌరవాన్ని కించపరచడంతోపాటు బీహార్‌లోని ఒక నిర్దిష్ట కులాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని దుమ్మెత్తిపోశారు. తన వ్యాఖ్యలపై తేజస్వీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, తేజస్వీ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాజకీయాల్లో మోదీ ‘సూత్రధారి’ అని ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, దానిని కులానికి ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు.
Tejashwi Yadav
Narendra Modi
Sanjay Jaiswal
Bihar politics
RJD
BJP
Soothradhari
political controversy
caste politics
NDA government

More Telugu News