Saroja Devi: అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత

Actress Saroja Devi Passed Away at 87



ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస వదిలారు. పదమూడేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరోజాదేవి.. తన కెరీర్ లో 200 లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

సరోజాదేవి తెలుగు, కన్నడ, తమిళంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌లతో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. సరోజాదేవి స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తెలుగులో సీతారామ కళ్యాణం (1961) మరియు జగదేక వీరుని కథ (1961), మరియు దాగుడు మూతలు (1964), అమర శిల్పి జక్కన్న (1964) రహస్యం, పెళ్లి కానుక (1960), ఇంటికి దీపం ఇల్లాలే, మంచీ చెడు.. వంటి హిట్ సినిమాల్లో నటించారు.
Saroja Devi
B Saroja Devi
actress Saroja Devi
Telugu cinema
Kannada cinema
Tamil cinema
Padma Bhushan
veteran actress
Tollywood
Bangalore

More Telugu News