Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
- లెజెండరీ యాక్టర్ కోట కన్నుమూత
- జూబ్లీహిల్స్ లో కోట నివాసానికి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
- కోట కుటుంబ సభ్యులకు పరామర్శ
తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని కోట నివాసానికి వెళ్లారు. కోట భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం, కోట కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్ర విషాదంలో ఉన్న వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కోట సోదరుడు శంకరరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు.











