Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మరణంపై మోహన్ బాబు, మంచు విష్ణు స్పందన

Kota Srinivasa Rao Death Mohan Babu Manchu Vishnu React
  • తుదిశ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు
  • విషాదంలో టాలీవుడ్
  • ప్రియమైన కోట... మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అంటూ మోహన్ బాబు ట్వీట్
  • కొద్దిమందికి మాత్రమే దక్కే అరుదైన ప్రతిభ కోట సొంతం అన్న మంచు విష్ణు
టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్, లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు (83) ఆదివారం (జూలై 13) నాడు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందించారు.

"ప్రియమైన కోట, మిమ్మల్ని ఇకపై చాలా మిస్ అవుతాము. మీ ప్రతిభ, మీ ఉనికి, మీ మంచి మనసుని ఎప్పటికీ మరిచిపోలేము. మాటల్లో చెప్పలేని దు:ఖం కలుగుతోంది. కోట ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి శక్తిని ప్రసాదించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి" అని పేర్కొన్నారు. 

మంచు విష్ణు స్పందిస్తూ... "మాటల్లో చెప్పలేనటువంటి ఓ గొప్ప నటుడు, లెజెండ్ కోట శ్రీనివాసరావు గారు చనిపోయారనే వార్త తెలిసి నా గుండె బరువెక్కింది. అద్భుతమైన నటుడు, అసమాన ప్రతిభ, ఆయన ఉనికి ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ వెలుగు నింపింది. అది సీరియస్ పాత్ర అయినా, విలన్ అయినా, కామెడీ అయినా... ప్రతి పాత్రలోనూ ఆయన ప్రాణం పోశారు. అలాంటి అరుదైన ప్రతిభ కొద్దిమందికే దక్కుతుంది.

ఆయనతో చాలా సినిమాల్లో పనిచేసే అదృష్టం నాకు కలిగింది, ఇంకా చాలా సినిమాల్లో ఆయనను చూస్తూ పెరిగాను. ఆయన నటనే సినిమా పట్ల నాకు ఆరాధన భావనను పెంచింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మనం ఆయనను శారీరకంగా కోల్పోయి ఉండవచ్చు, కానీ ఆయన కళ, ఆయన నవ్వు, ఆయన ఆత్మ... ఆయన అలంకరించిన ప్రతి సన్నివేశంలో సజీవంగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం. మీరు ఎప్పుడూ మా గుండెల్లో నిలిచిపోయి ఉంటారు" అని విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు.
Kota Srinivasa Rao
Mohan Babu
Manchu Vishnu
Telugu actor death
Tollywood
obituary
Telugu cinema
actor death
Kota Srinivasa Rao passes away

More Telugu News