తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన గన్ మెన్.. వీడియో ఇదిగో!
- క్యూ న్యూస్ ఆఫీసులో దుండగుల బీభత్సం
- నేలపై రక్తపు మరకలు, ధ్వంసమైన ఫర్నీచర్
- తెలంగాణ జాగృతి కార్యకర్తలే దాడి చేశారని ఆరోపణలు
దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగిందని, జాగృతి కార్యకర్తలే దాడి చేశారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, దుండగులు సృష్టించిన బీభత్సం, కార్యాలయంలో రక్తపు మరకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.