Surendra Kewat: బీహార్‌లో బీజేపీ నేత కాల్చివేత

Surendra Kewat BJP Leader Shot Dead in Bihar
  • పాట్నాలో ఇటీవల వ్యాపారి గోపాల్ ఖేమ్కా హత్య
  • బైక్‌పై వచ్చి బీజేపీ నేత సురేంద్ర కేవత్‌ను కాల్చి చంపిన దుండగులు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యను మర్చిపోకముందే బీహార్ అటువంటిదే మరో ఘటన జరిగింది. అయితే, ఈసారి హత్యకు గురైంది బీజేపీ నాయకుడు. గోపాల్ ఖేమ్కా హత్యకు గురైన పాట్నాలో ఇది కూడా జరగడం గమనార్హం. షేక్‌పురాలో  బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ నేత సురేంద్ర కేవత్‌ (52)పై కాల్పులు జరిపి పరారయ్యారు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే గోపాల్ రవిదాస్, మాజీ మంత్రి శ్యామ్ రజక్ ఆసుపత్రికి చేరుకున్నారు. కేవత్ కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ‘‘సురేంద్ర పొలాల్లో పని చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. అతన్ని ఎయిమ్స్‌కు తరలించారు. కానీ చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేశాం" అని పోలీసు అధికారి కన్హయ్య సింగ్ తెలిపారు.

సురేంద్ర కేవత్ గతంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడిగా పనిచేశారు. ఈ హత్య ఆ ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. ముఖ్యంగా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యకు గురైన కొన్ని రోజుల తర్వాత ఈ దారుణ హత్య జరగడం గమనార్హం. రాష్ట్రంలో వరుస హత్యలపై నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. 
Surendra Kewat
Bihar BJP leader
BJP leader murdered
Sheikhpura
Gopal Ravidas
Nitish Kumar government
Bihar crime
Patna AIIMS
Kisan Morcha
Shyam Rajak

More Telugu News