Sai Krishna: కొన్ని రోజుల్లో పెళ్లి... రోడ్డు ప్రమాదంలో బావామరదలు మృతి

Tragedy as couple Sai Krishna Anita die before their wedding
  • త్వరలో పెళ్లి చేసుకోవాల్సిఉన్న బావమరదలు సాయికృష్ణ, అనిత
  • బావామరదలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ 
  • అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె వద్ద ఘటన
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజుల్లో వివాహం జరగనున్న బావామరదలు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటన మండలంలోని బాలపల్లె వద్ద జరిగింది. సాయికృష్ణ (29), అనిత (21) అనే బావామరదళ్లు త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

నిన్న వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బావ, మరదలు ఇద్దరూ మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. 
Sai Krishna
Annamayya district
Railway Koduru
road accident
marriage
Sai Krishna Anita death
Andhra Pradesh accident
Balapalle
lorry accident

More Telugu News