Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

Revanth Reddy responds to BC Reservations
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయమన్న సీఎం రేవంత్ రెడ్డి
  • రిజర్వేషన్ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం
  • తెలంగాణలో కులగణన చాలా పకడ్బందీగా చేశామన్న సీఎం రేవంత్
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది.

ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాలన్నింటిపై చర్చించిన కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీసీ నేతలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయంగా పేర్కొన్నారు. రిజర్వేషన్ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని అన్నారు.

రాష్ట్రంలో కులగణన చాలా పకడ్బందీగా చేశామని తెలిపారు. ఇది దేశానికే ఉత్తమ నమూనా అని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కులగణనకు వివరాలు వెల్లడించారని తెలిపారు. ఈ సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి భద్రపరిచామని వెల్లడించారు. 
Revanth Reddy
Telangana BC Reservations
BC Reservations
Local Body Elections
Telangana Elections
Caste Census
Telangana Government
Congress Party

More Telugu News