సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి
- లిక్కర్ స్కామ్ కేసులో నేడు విచారణకు హాజరుకావాల్సిన విజయసాయి
- ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయంటూ సిట్ కు సమాచారం పంపిన వైనం
- విచారణకు వచ్చే తేదీని తెలియజేస్తానన్న విజయసాయి
ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 18న విజయసాయి తొలిసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా కుంభకోణంలో కీలక సూత్రధారులు, పాత్రధారుల పేర్లను ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.
మరోవైపు, ఈ ఉదయం విజయసాయి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎవరైతే కర్మను చేస్తారో వారు అనుభవించక తప్పదు అనేవిధంగా భగవద్గీత శ్లోకాన్ని ఆయన పోస్ట్ చేశారు.