Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Kangana Ranaut MPs Salaries Not Enough
  • రాజకీయాల్లో నిజాయితీగా పని చేసే ఎంపీలకు వేతనం సరిపోవడం లేదన్న కంగన
  • సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనన్న కంగన
  • ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్ తీరు నచ్చడం లేదన్న కంగన రనౌత్
రాజకీయ నాయకుల వేతనాలపై ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రాజకీయాల్లో నిజాయితీగా పని చేసే ఎంపీలకు వేతనం సరిపోవడం లేదని అన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనని అన్నారు. ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి నియోజకవర్గాలకు వాహనాలలో వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం కనీసం 300 నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంపీలకు వచ్చే వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే చాలామంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, కొందరు న్యాయవాద వృత్తిలో ఉండగా, ఇంకొందరు ఇతర వృత్తుల్లో ఉన్నట్లు చెప్పారు. ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం కాబట్టి ఆ పదవిని వృత్తిగా తీసుకోలేమని పేర్కొన్నారు.

ట్రంప్‌కు ఇప్పుడు మద్దతుదారును కాదు...

గతంలో తాను ట్రంప్‌నకు మద్దతుదారునని, కానీ ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన తీరు నచ్చడం లేదని కంగనా రనౌత్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఆగిపోవడానికి తానే కారణమని ట్రంప్ చెబుతున్నారని, అందుకే ఆయన తీరు నచ్చడం లేదని అన్నారు. అమెరికాలో కూడా ఆయన తప్పులు చేస్తున్నట్లు చెప్పారు.
Kangana Ranaut
MP salary
Indian Politicians
Member of Parliament
Politician Income

More Telugu News