Perni Nani: ఏదైనా చేయాలంటే... చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి: పేర్ని నాని

Perni Nani Comments on Rappa Rappa Dialogue in AP Politics
  • ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన 'రప్పా రప్పా' డైలాగ్
  • రప్పా రప్పా అంటూ వేలంవెర్రిగా మాట్లాడొదన్న పేర్ని నాని
  • ఇకపై ముల్లును ముల్లుతోనే తీయాలని శ్రేణులకు సూచన
'పుష్ప' సినిమాలోని 'రప్పా రప్పా' డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు, బ్యానర్లలో కనిపించడం... ఆ పార్టీ అధినేత జగన్ నోటి వెంట నుంచి రావడం రాజకీయాల్లో వేడిని పెంచింది. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మంత్రి నారా లోకేశ్ మాదిరి మీరు కూడా చెడిపోయారా? అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. లోకేశ్ రెడ్ బుక్ అంటే... మీరు రప్పా రప్పా అంటున్నారని... రప్పా రప్పా అంటే తప్పు కాదని, కానీ ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలని చెప్పారు. 

రప్పా రప్పా అంటూ వేలంవెర్రిగా మాట్లాడకూడదని... ఇకపై ముల్లును మల్లుతోనే తీయాలని పేర్ని నాని అన్నారు. ప్రజల మన్ననలు పొందేలా పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. నారా లోకేశ్ రెడ్ బుక్ చివరకు కూటమి ప్రభుత్వానికి ఉరితాడు అవుతుందని చెప్పారు.
Perni Nani
YS Jagan
Nara Lokesh
YSRCP
TDP
Andhra Pradesh Politics
Rappa Rappa
Pushpa Movie
Political Speech
AP Government

More Telugu News